అయితే ఐపీఎల్ కారణంగా ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలనుకునే ఎంతో మంది యువ ఆటగాళ్ళకు మంచి ఛాన్స్ కూడా దొరుకుతూ ఉంది. అయితే ఒకవైపు భారీగా ఆదాయంతో పాటు ఇంకోవైపు పాపులారిటీ కూడా ఐపీఎల్ ద్వారా సంపాదించిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే అచ్చం ఐపీఎల్ తరహాలోనే అటు బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని కూడా నిర్వహించింది. మహిళా క్రికెట్ ను మరింత ప్రోత్సాహించాలి అని ఉద్దేశంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ని గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది బీసీసీఐ.
ఈ క్రమంలోనే గత ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం సన్నాహాలను మొదలుపెట్టింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19వ తేదీన నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించగా.. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన మినీ వేలాన్ని డిసెంబర్ 9న నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఆక్షన్ దుబాయ్ వేదికగా జరిగే అవకాశం ఉండగా.. ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ వేదిక ఇంకా ఖరారు కాలేదు అన్నది తెలుస్తుంది. అయితే భారత్ వేదికగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి