అయితే పదేళ్ల తర్వాత ప్రస్తుతం సొంత గడ్డ పైన వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా అయితే 2011లో కూడా ఇలా సొంత గడ్డపై జరిగిన వరల్డ్కప్ లోనే భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని భారత అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు ఓటమి ఎరుగని జట్టుగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు.. ఇక పాయింట్ల పట్టికలో టాప్ లోనే ఉంది. దీంతో ఈసారి రోహిత్ సేన తప్పకుండా కప్పు కొట్టడం ఖాయమని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఐసీసీ టైటిల్స్ ధీరుడు మాజీ కెప్టెన్ ధోని ఈ విషయంపై స్పందించాడు.
ఈసారి టీమిండియా పటిష్టంగా కనిపిస్తుందని.. వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన మహేంద్రసింగ్ ధోని.. ఇంతకంటే నేనేం ఎక్కువ చెప్పగలను. అర్థం చేసుకునే వాళ్లకు ఒక్క సైగ చేసిన చాలు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరు చూస్తే తప్పకుండా ట్రోఫీ ముద్దాడుతుంది అని చెప్పకనే చెప్పాడు ఈ లెజెండ్. దీంతో ధోనీ చెప్పాడు అంటే చాలు ఇక తప్పకుండా టీమిండియా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది. ఎందుకంటే ధోని అంచనా ఎప్పుడూ తప్పవ్వదు అంటూ అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి