ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ధోని కెప్టెన్సీ వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యంగ్ బౌలర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్లో ఏకంగా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు ఈ యంగ్ బౌలర్ అతను ఎవరో కాదు తుషార్ దేశ్పాండే. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలో.. ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. మిజోరం జట్టు బ్యాట్స్మెన్లు వికాస్ కుమార్, జహగా అండర్సన్, జోసెఫ్ లాల్తాన్ లను అవుట్ చేశాడు దేశ్పాండే.
ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పుడు వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ఈ యంగ్ బౌలర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన మిజోరం ముంబై బౌలర్ తో దాటికి 18.3 ఓవర్లలోనే 76 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. కాగా 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం ఆరు ఓవర్లలోనే ఒక్క వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని చేదించి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ముంబై బ్యాట్స్మెన్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 46 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి