అది కూడా ప్రత్యర్థి పై పూర్తి పై చేయి సాధించి విజయం సాధించడం గమనార్హం. అయితే నేడు పటిష్టమైన ఇంగ్లాండు తో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే ఈ రెండు టీమ్స్ మాత్రం మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా హోరాహోరీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక ప్రస్తుత వరల్డ్ కప్ లో మాత్రం రెండు టీమ్స్ ప్రస్థానం భిన్నంగా ఉంది. ఒకవైపు టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం వరుస పరాజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ అవకాశాలను కూడా కోల్పోయింది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం.. చూసుకుంటే భారత్ ఇంగ్లాండ్ పై ఎంతో అలవోకగా విజయం సాధించడం ఖాయం అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అంచనా వేస్తున్నారు.
అయితే నేడు ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్లో టీమిడియా విజయం సాధించింది అంటే ఇక సెమిస్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లే అవుతుంది. ప్రస్తుతం భారత్ పది పాయింట్లతో ఉంది. ఇంగ్లాండ్తో గెలిస్తే 12 పాయింట్లకు చేరుతుంది. అయితే పాయింట్స్ టేబుల్ లో పైన ఉన్న నాలుగు జట్లు కాకుండా శ్రీలంక మాత్రమే గరిష్టంగా 12 పాయింట్లకు చేరుకోగలదు లేదా శ్రీలంక తర్వాత ఆడనున్న మ్యాచ్ల ప్రకారం చూసుకుంటే ఇక టీమిండియా కు సెమి ఫైనల్ బెర్త్ ఖాయం అయినట్లే అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే నేడు అటు ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాలని భారత ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి