ఇక తన విషయాల గురించి పెద్దగా అప్డేట్లు కూడా ఇవ్వడు. అయినప్పటికీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ఇక ధోని ఏదైనా మాట్లాడాడు అంటే చాలు దాని గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు ఇక ఇటీవల ఏకంగా బ్యాచిలర్స్ కి మహేంద్రసింగ్ ధోని ఒక సలహా కూడా ఇచ్చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
రిలేషన్షిప్ విషయంలో బ్యాచిలర్స్ కి ధోని సలహా ఇచ్చాడు. మీరు ఎవరితోనైనా సంతోషంగా ఉన్నారా అంటే ఇక వారిని పెళ్లి చేసుకోండి.. అలాగే గర్ల్ ఫ్రెండ్ ఉన్న బ్యాచిలర్స్ కి ఉండే ఒక దురాభిప్రాయంపై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా.. నా గర్లు ఫ్రెండ్ ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకం అని ఎప్పుడూ అనుకోవద్దు అంటూ ధోని ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొని కామెంట్ చేశాడు. దీంతో ధోని వ్యాఖ్యలతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు అని చెప్పాలి. అలాగే జీవిత భాగస్వామి మన బలానికి మూలం అంటూ వారి విలువలను కూడా వివరించాడు మహేంద్ర సింగ్ ధోని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి