ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న  వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఎందుకో అంచనాలకు తగ్గట్టుగా ప్రదర్శన చేయడం లేదు. వరుస ఓటములతో సతమతమవుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా నాలుగు పరాజయా లను చవిచూసింది. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది పాకిస్తాన్ జట్టు.


 దీంతో దాదాపు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక సెమీస్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకునేందుకు.. ఇటీవల అటు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది పాకిస్తాన్ జట్టు. అయితే పాకిస్తాన్ ఇలాంటి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడడానికి కారణం ఏంటి అన్న విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉండగా.. పాకిస్తాన్ వైఫల్యానికి టీం ఇండియానే కారణం అంటూ పాకిస్తాన్ క్రికెటర్ పకర్ జమాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చాలా పెద్దది. ఈ మ్యాచ్ లో ఓటమి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతిస్తుంది. ఇక అయితే మా ఆటగాళ్లందరూ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారని.. అలాంటి పరాజయాల నుంచి ఎలా కోలుకోవాలో తమకు తెలుసా అని పకర్ జమాన్ చెప్పుకొచ్చాడు. కాగా భారత్తో జరిగిన మ్యాచ్లో పకర్ జమాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్లో అతను కూడా పునరాగమనం చేసి జట్టును విజయపతంలో నడిపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ పై భారత్ విజయం గురించి ప్రశ్న ఎదురైంది. అయితే భారత జట్టు తమపై సాధించిన విజయంతో పాకిస్తాన్ ఆత్మ స్థైర్యం దెబ్బతింది. అదే మిగతా మ్యాచ్లలో కూడా ప్రభావితం చేసింది. కానీ ఆ తర్వాత మేము మళ్ళీ పుంజుకున్నాం. దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లోను మా ప్రదర్శన బాగుంది అంటూ ఫకర్ జమాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc