శ్రేయాస్ అయ్యర్ ఖాతాలో సూపర్ రికార్డ్ ?
Shreyas Iyer: 2023 ప్రపంచ కప్ టీమ్
ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ చాలా పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అతను చాలా తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యి పెవిలియన్ కి చేరాడు.కానీ, గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన పాత సూపర్ ఫామ్‌లో కనిపించాడు. శ్రీలంకపై హాఫ్ సెంచరీ చేసిన
శ్రేయాస్ అయ్యర్ ఈ ప్రపంచకప్‌లోనే అత్యంత పొడవైన సిక్సర్ కూడా కొట్టాడు.
శ్రీలంక జట్టుపై
శ్రేయాస్ అయ్యర్ ఏకంగా 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యంత పొడవైన సిక్స్.ఇక ఇదే ప్రపంచకప్‌లో 101 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్.. ఇక పొడవైన సిక్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.
అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్ టీంపై తుఫాన్ సెంచరీతో చెలరేగిన
ఆస్ట్రేలియా జట్టు డేంజరస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్వెల్.. 104 మీటర్ల పొడవైన సిక్సర్‌తో ఈ రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోసారి లంకపై చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. 106 మీటర్ల పొడవైన సిక్సర్ కొట్టి.. మళ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకొని మొత్తానికి తన సూపర్ ఫామ్ ని తిరిగి తెచ్చుకున్నాడు.ఆ మ్యాచ్ లో 82 పరుగులు తీశాడు.ఈ 2023 ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి ఇది రెండో అర్ధ సెంచరీ. అంతకుముందు పాకిస్థాన్ టీంపై 53 పరుగులతో శ్రేయాస్ అజేయంగా నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో
శ్రేయాస్ అయ్యర్ మొత్తం 216 పరుగులు చేశాడు. మరి రాబోయే మ్యాచ్ ల్లో కూడా ఇదే సూపర్ ఫామ్ ని
శ్రేయాస్ అయ్యర్ కంటిన్యూ చేస్తాడో లేడో చూడాలి.