2023 వన్డే వరల్డ్ కప్ లో ఒక ఆటగాడు మొదటి నుంచి తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. అతను ఎవరో కాదు రచిన్ రవీంద్ర. భారత దిగ్గజ క్రికెటర్లు అయినా రాహుల్ ద్రావిడ్ లోని రా అక్షరం ఇకక్రికెట్ దేవుడిగా కొనసాగుతున్న సచిన్ టెండుల్కర్ లోని రెండక్షరాలు తీసుకొని అతనికి తల్లిదండ్రులు రచిన్ అనే పేరు పెట్టారు. గత కొంతకాలం నుంచి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దిగజాల పేరు పెట్టుకుంటే సరిపోతుందా వాళ్ళలాగా బాగా రాణించాల్సిన అవసరం లేదా అని కొంతమంది కామెంట్లు కూడా చేశారు.


 అయితే కేవలం ఇలాంటి లెజెండ్స్ పేర్లను కలిపి పెట్టుకోవడమే కాదు లెజెండ్స్ సాధించిన రికార్డులను కూడా బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని రచన్ రవీంద్ర వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అదరగొట్టేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర వహిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో కూడా సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లుగా చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్.



 అతను ఆడుతుంది మొదటి వరల్డ్ కప్ అయినప్పటికీ ఎక్కడ ఒత్తిడి దరి చేరనివ్వకుండా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల సాధించిన సెంచరీ తో ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో ఏకంగా 500 ప్లస్ పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తాను ఆడుతున్న తొలి వరల్డ్ కప్ లోనే 500 కు పైగా రన్స్ చేసి.. ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు  అంతకుముందు 2019 వరల్డ్ కప్ లో బెయిర్ స్ట్రో 532 పరుగులు చేశాడు  ఇక అతి చిన్న వయసు (అండర్ 25) లో 500 కు పైగా రన్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్  1996లో 523 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: