టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టుకు ఒక సాదాసీదా ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చిన  ధోని ఏకంగా భారత క్రికెట్ అనే పుస్తకంలో ఆటగాడిగా కెప్టెన్గా ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ గా మారిన తర్వాత దశాబ్దాల నుంచి భారత జట్టుకు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక భారత క్రికెట్ చరిత్రలో కొనసాగుతూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని.


 అందుకే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన అటు ధోని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గదు అని చెప్పాలి. అయితే ధోని భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సమయంలో.. ఇక అతని బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా యువరాజ్ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో కోహ్లీ రోహిత్ ఎలా అయితే కొనసాగుతున్నారో.. గతంలో ధోని, యువరాజ్ మధ్య కూడా అలాంటి స్నేహ బంధమే ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే కాస్త ఎక్కువగానే ఉండేది. ఇక ధోని కెప్టెన్సీలో యువరాజు ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు విజయం అందించాడు. ఇక వీరిద్దరి మధ్య స్నేహ బంధానికి కోట్లాది మంది అభిమానులు కూడా ఉన్నారు.


 గతంలో ఒక హీరోయిన్ కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల ధోనితో స్నేహం గురించి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోని, తాను క్లోజ్ ఫ్రెండ్స్ కాదు అంటూ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు. మహి, నేను క్రికెట్ వల్లే స్నేహితులం అయ్యాము. అయితే క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరి లైఫ్ స్టైల్ ఎంతో వేరుగా ఉంటుంది. కానీ గ్రౌండ్ లోకి దిగినప్పుడు మేము దేశం కోసం 100% కంటే ఎక్కువగానే పోరాడుతాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులో కెప్టెన్ వైస్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాల్లో విభేదాలు ఉండొచ్చు అంటూ యువరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: