అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉల్టా ఫుల్ట అనే కాన్సెప్ట్ కు తగ్గట్లుగా కొన్ని ట్విస్టులు కూడా ఇస్తూ ఉన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్ళీ హౌస్ లోకి పంపించడం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే గతంలో డబుల్ ఎలిమినేషన్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్ళీ హౌస్ లోకి పంపించాడు. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయిన ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ నుంచి రతికను మళ్ళీ సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు ఇలాంటి ట్విస్ట్ మరొకటి ఏమైనా ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లుగానే మరో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ కి కూడా అవకాశం ఇవ్వబోతున్నారట అతను ఎవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న ఆట సందీప్. మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే సందీప్ రీఎంట్రీ ఉన్నా లేకపోయినా వచ్చిన సెకండ్ ఛాన్స్ యూస్ చేసుకోకపోతే రతిక మాత్రం ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని వార్తలు కూడా వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి