ఇక ఇప్పుడు ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఏకంగా సొంత గడ్డపైనే అతను మ్యాచ్ లు ఆడుతున్నాడేమో అన్నట్లుగా బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. సెంచరీలతో చెలరేగిపోతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో మూడు సెంచరీలు సాధించాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే ఒక వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన యంగ్ బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఇటీవల ఇతనికి ఐసీసీ మరో అరుదైన అవార్డును కట్టబెట్టింది.
ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్న రచిన్ రవీంద్రను అక్టోబర్ నెలకు గాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే అవార్డు వరించింది. ప్రస్తుతం జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో గత నెలలో రవీంద్రా రెండు సెంచరీలు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 9 మ్యాచ్లో 565 పరుగులతో హై స్కోరర్ గా కొనసాగుతూ ఉన్నాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. ఈ ఒక్క వరల్డ్ కప్ టోర్నీలోనే మూడు శతకాలు ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి