అయితే నాలుగవ స్థానం కోసం మాత్రం పోటీ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై ఘనవిజయాన్ని సాధించడం ద్వారా సెమీఫైనల్ అవకాశాలకు మరింత దగ్గర అయింది. అయితే ఇక నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్తో పోటీపడుతున్న పాకిస్తాన్ నేడు అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో అటు పాకిస్తాన్ సెమీఫైనల్ కోసం అద్భుతాలు చేసి చూపించాల్సి ఉంది. అయితే నేడు పూణేలో ఉదయం 10:30 గంటలకు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ నామమాత్రమైన మ్యాచ్ కావడం గమనార్హం. అయితే కోల్కతాలో మధ్యాహ్నం రెండు గంటలకు ఇంగ్లాండ్, పాకిస్తాన్ జరగబోయే మ్యాచ్ పై అందరూ దృష్టి ఉంది. పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్కు చేరాలంటే అద్భుతం జరగాల్సి ఉంది. ఆ జట్టు 286 పరుగులు తేడాతో విజయం సాధించడమే కాదు ఒకవేళ టార్గెట్ చేదించాల్సి వస్తే 2.5 ఓవర్లలో అటు లక్ష్య చేదన చేయాల్సి ఉంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో టాస్ పాకిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. టాస్ గెలిస్తే పాక్ ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఇంగ్లాండ్పై విజయం సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి