దీంతో అది ఎలాగో జరిగే పని కాదు. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలక ముందే ఇక పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఇంటికి వెళ్తుంది అన్న వార్త మాత్రం భారత క్రికెట్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేస్తుంది. అదేంటి బాసూ.. పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తే ఇండియా ఫ్యాన్స్ ఎందుకు నిరాశపడతారు అంటారా.. దీని వెనక ఒక కారణమే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ బాగా రానించి సెమీఫైనల్ అడుగుపెట్టి ఉంటే న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించేది.
తద్వారా ఇండియా, పాకిస్తాన్ మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ జరిగేది. ఎలాగో వరల్డ్ కప్ లో ఇండియాదే పాకిస్తాన్ పై పైచేయి. కాబట్టి ఇక ప్రస్తుతం ఉన్న ఫామ్ లో టీమిండియా అలవోకగా విజయం సాధించేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ సరిగ్గా ఆడక పోవడంతో న్యూజిలాండ్ సెమీఫైనల్ కి వెళ్ళింది. దీంతో న్యూజిలాండ్ తో సెమి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. న్యూజిలాండ్ పై భారత్కు ఏమాత్రం మంచి రికార్డులు లేవు. ఎక్కువ శాతం న్యూజిలాండ్ దే పైచేయి ఉంది. 2019 వరల్డ్ కప్ లోనే న్యూజిలాండ్ చేతిలోనే సెమీస్ లో ఓడిపోయింది ఇండియా. దీంతో న్యూజిలాండ్ కి బదులు పాకిస్తాన్ సెమిస్ కి వచ్చి ఉంటే బాగుండేది. అలా జరగకుండా పాకిస్తాన్ ఇంటికి వెళుతుండడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ ప్రస్తుతం కాస్త నిరాశ చెందుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి