ఇక ప్రతి మ్యాచ్ లో కూడా 100 రెడ్ బుల్స్ ఒకటేసారి తాగేసాడేమో అనేంత ఎనర్జీతో బరిలోకి దిగుతూ ఉంటాడు. ఇలాంటి ఎనర్జీనే అటు కోహ్లీ ప్రత్యర్ధులు అందరిని కూడా భయపెడుతూ ఉంటుంది. కనీసం కోహ్లీతో స్లెడ్జింగ్ చేయడానికి కూడా ప్రత్యర్ధులు భయపడతారు అంటే ఇక అతని ఆట తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి జంటకు విరుష్క అంటూ ఒక నిక్ నేమ్ కూడా పెట్టేశారు అభిమానులు. అయితే ఇద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే ఇటీవల విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేశాడు. ఇక ఈ సంభాషణలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కోహ్లీకి యార్కర్ అంటే భయమా? లేదంటే 150 స్పీడులో ఉన్న బౌన్సర్ అంటే భయమా అంటూ అనుష్క ప్రశ్నించింది. యార్కర్ అయితే డిఫెన్స్ ఆడొచ్చు. బౌన్సర్ అంటే భయం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఇష్టమైన ఫుడ్ బాల్ క్లబ్ మంచేస్టర్ సిటీ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి