వరల్డ్ క్రికెట్ లో భారత జట్టు పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతుంది. అయితే ప్రపంచకప్ టోర్ని జరిగిన ప్రతిసారి కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది. అయితే చివరిసారిగా 2011 వన్డే వరల్డ్ కప్ లో ధోని కెప్టెన్సీలో విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. ఆ తర్వాత పలు వరల్డ్ కప్లలో ఆడినప్పటికీ మొదట్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. సెమీఫైనల్ లాంటి కీలకమైన మ్యాచులలో మాత్రం నిరాశపరిచి చివరికి ఇంటిదారి పట్టింది అని చెప్పాలి. దీంతో ఇక వరల్డ్ కప్ టైటిల్ అనేది టీమిండియాకు అందని ద్రాక్ష లాగే మారిపోయింది.



 అయితే ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో మాత్రం భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లో విశ్వవిజెతగా నిలుస్తుంది అని అభిమానులందరికీ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ తర్వాత పుష్కర కాలానికి ఇప్పుడు భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. అదే సమయంలో టీమిండియా ఫుల్ ఫామ్ లో కనిపిస్తుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది భారత జట్టు. లీగ్ మ్యాచ్లలో భాగంగా ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో అన్నింట విజయం సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే సెమి ఫైనల్లో న్యూజిలాండ్తో తలబడబోతుంది టీమిండియా.


 దీంతో ఈసారి భారత జట్టు టైటిల్ విజేతగా నిలవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఇక ఇదే విషయం గురించి భారత మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా ఫామ్ ని బట్టి చూస్తే ఈసారి వరల్డ్ కప్ టైటిల్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై అన్ని అనుకూలంగా ఉన్న ఈ ఏడాది కప్ గెలవకపోతే.. ఇక మరో మూడు వరల్డ్ కప్పుల వరకు గెలవలేమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాట్స్మెన్ లు ఉన్న ఫామ్.. బౌలర్ల ప్రదర్శన తీరు చూస్తుంటే  తప్పకుండా టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc