కాగా ఇక రేపటి నుంచి సెమీఫైనల్ మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి కీలకమైన మ్యాచ్ జరుగుతున్న సమయంలో గత గణాంకాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. గత రికార్డులను బట్టి ప్రస్తుత మ్యాచ్లో జట్టు ప్రదర్శనను అంచనా వేయడం చేస్తూ ఉంటారు ప్రేక్షకులు.
అయితే సెమీఫైనల్ పోరులో భారత జట్టు రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే.. 1983లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ పై భారత జట్టు విజయం సాధించింది. 1987లో ఇక ఇంగ్లాండ్ చేతిలో సెమి ఫైనల్లో ఓడిపోయింది భారత్. 1996 లోను ఇదే రిపీట్ అయింది. శ్రీలంక చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. 2003లో కెన్యాపై గెలిచిన భారత్.. 2011లో పాకిస్తాన్ పై కూడా ఘనవి విజయాన్ని అందుకుంది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా.. 2019లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. ఇక ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లో సెమిస్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి