ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలు భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా రానిస్తూ అదరగొడుతుంది టీమిండియా. లీగ్ దశలో వరుస విజయాలు సాధిస్తూ తమకు తిరుగులేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే లీక్ దశలో బాగా రాణించినా నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం టీమిండియా ఒత్తిడిలో డీల పడిపోయే అవకాశం ఉందని ఎంతోమంది టెన్షన్ పడ్డారు. కానీ ఇక లీగ్ దశలో ఏదైతే జోరును చూపించిందో.. ఇటీవల సెమీఫైనల్ మ్యాచ్ లోను అదే దూకుడుతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది.


 తమకు అస్సలు అచ్చిరాని ప్రత్యర్థిగా కొనసాగుతున్న న్యూజిలాండ్ తో సెమి ఫైనల్లో తలబడిన టీమిండియా.. 2019 సెమీఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారీ పరుగుల తేడాతో విజయం సాధించి.. ఇక ఫైనల్ అడుగు పెట్టింది అని చెప్పాలి. భారత బ్యాట్స్మెన్లు అద్భుతంగా రానించి భారీ పరుగులు చేయగా.. ఇక ఆ తర్వాత పరుగులు కట్టడి చేయడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. మరీ ముఖ్యంగా మహమ్మద్ షమీ ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు అని చెప్పాలి. అయితే భారత్ సాధించిన విజయ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.



 కానీ  పాకిస్తాన్ నటి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. సెమీఫైనల్ లో న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయింది అంటూ సంచలన ఆరోపణలు చేయగా.. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. పాకిస్తాన్ నటి సేహర్ షిన్వారి ఇలా సంచలన ఆరోపణ చేసింది. భారత టీం ఆటగాళ్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని వారికి తెలుసు. కానీ నిజంగా మ్యాచ్ ఆడుతున్నట్లు వాళ్లు నటించారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇండియన్ టీమ్ మరోసారి ఫైనల్ కు వెళ్లడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్న.. భారత్ అన్ని విషయాల్లో మన దేశం కంటే ఎందుకు ముందుంది అంటూ మరో పోస్ట్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc