దీంతో ఇక రెండు పటిష్టమైన టీమ్స్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా ముందుగా ఊహించడం ఎంతో కష్టంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ముగింపు వేడుకలను కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కి భారత్ ఆస్ట్రేలియా దేశాల ప్రధాన మంత్రులు కూడా హాజరుకానున్నారు. అంతేకాదు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నారు అని చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎంతోమంది స్టార్ హీరోలు.. ఈ ఫైనల్ మ్యాచ్కు హాజరు కాబోతున్నారట. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ హీరో మోహన్లాల్, టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాటు మరికొంతమంది హీరోలు స్టేడియం కు వచ్చి సందడి చేయబోతున్నారట. అయితే మ్యాచ్ కి ముందు ప్రదర్శనలు, ఎయిర్ షో ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి