ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నాలుగేళ్లకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకి ప్రత్యేకమైన ట్రోఫీని బహుమతిగా ఇవ్వడం చేస్తూ వస్తుంది ఐసీసీ. అయితే ఇలా వరల్డ్ కప్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీ అందించడం.. ఇక ప్రతి వరల్డ్ కప్ లో కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఇలా ఒక టీం అందుకున్న ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.


ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. 1975లో ఇక వన్డే ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమైంది. క్రికెట్ కు పుట్టినల్లుగా పిలుచుకున్న ఇంగ్లాండులోనే వరుసగా మూడు ప్రపంచ కప్ ట్రోఫీలు జరిగాయి. ఆ సమయంలో ట్రోఫీని ఫ్రూడెన్షియల్ కప్ ట్రోఫీ అని పిలిచేవారు. ఇక 1975 నుంచి 83 వరకు విశ్వవిజేతిగా నిలిచిన జట్లకు ఇదే ట్రోపీని బహుకరించారు. ఇక 1983లో భారత్ తొలిసారి కపిల్ దేవ్ కెప్టెన్సీలో ప్రపంచకప్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 1987లో భారత్ తొలిసారి వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది.


 ఇక పాకిస్తాన్తో కలిసి భారత సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీకి రిలయన్స్ కప్ ట్రోఫీ అని నామకరణం చేశారు. ఇక తర్వాత ఇలా ట్రోఫీకి పలు రకాల పేర్లు మారుతూ వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇలా పేర్లు మారడం బాలేదు అని భావించిన ఐసీసీ.. 1999 నుంచి ఇప్పటివరకు ఒకే ట్రోఫీ అందిస్తూ వచ్చింది. మూడు వైపులా వికెట్ల నిర్మాణం వంటి దాని మధ్యలో బంతిపై విశ్వం ఉండేలా తీర్చిదిద్దుతున్న ట్రోఫీని విజేతలకు అందించారు. టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకి బహుమతి ప్రధానం సమయంలో ఒరిజినల్ ట్రోఫీని ఇస్తారు. తర్వాత దాన్ని తిరిగి దుబాయిలో ఉన్న ఐసీసీ ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. ఇక దీనిని నమూనా ట్రోఫీ విశ్వవిజేతకు అందిస్తారు. ఒరిజినల్ ట్రోఫీ 60 సెంటీమీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని బంగారం వెండితో తయారుచేస్తారు. అయితే ఇలా అసలు ట్రోఫీ దుబాయ్ లోని ఐసీసీ కార్యాలయంలో ఉంటే.. దాని ప్రతిమను మాత్రం విజేత జట్లు తమ దేశానికి తీసుకువెళ్తాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc