ఏకంగా ఈ వరల్డ్ కప్ టోర్నీలో మూడు సెంచరీలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇలాంటి ప్రదర్శన చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది అని చెప్పాలి ఇక నాకౌట్ మ్యాచ్లో కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సత్తా చాటాడు. అయితే ఇలా జట్టు కోసం ఎంతగానో శ్రమించిన విరాట్ కోహ్లీపై మొదటి నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే విరాట్ కోహ్లీ ఆడాడని.. ఎంతో సెల్ఫిష్ గా బ్యాటింగ్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని మరి విమర్శలు చేస్తున్నారు. అతని స్లో బ్యాటింగ్ జట్టుకు ఎంతో నష్టం చేసింది అంటూ ఆరోపిస్తున్నారు.
అయితే ఇలాంటి విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఘాటుగా స్పందించాడు. జట్టు విజయం కోసం ఎంత చేయాలో కోహ్లీ అంతా చేశాడు. అలాంటి కోహ్లీని విమర్శించేందుకు సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆకాష్ చోప్రా. టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఇచ్చిన పాత్ర సమర్థవంతంగా పోషించాడు. నాకౌట్ మ్యాచ్ లలోను సత్తా చాటాడు. ఇంతకంటే ఏం చేయగలడు. జట్టు విజయం కోసం కావాల్సిందల్లా చేశాడు. కానీ అతన్ని అర్థం పడటం లేని మాటలతో విమర్శిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇలాంటి మాటలే చలామణి అవుతున్నాయి అంటూ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి