ఈ క్రమంలోనే టైటిల్ గెలుస్తుంది అనుకున్న టీమిండియా అటు ఫైనల్ పోరులో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో ఇక భారత జట్టుకు టైటిల్ గెలవాలనె కల కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వన్డే వరల్డ్ కప్ ను నేపథ్యంలో రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్ కు అందుబాటులో ఉండడం లేదు. నేరుగా సెలెక్టర్ల దగ్గరికి వెళ్లి తాను వరల్డ్ కప్ పై దృష్టి సారించాలని అనుకుంటున్నానని.. అందుకే టీ20 లకు దూరంగా ఉంటాను అంటూ చెప్పేశాడు. ఈ క్రమంలోనే ఇక రోహిత్ విజ్ఞప్తిని అంగీకరించిన సెలెక్టర్లు అతన్ని టి20 ఫార్మాట్లో సెలెక్ట్ చేయడమే మానేశారు.
ఇక హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలను అప్పగిస్తూ ముందుకు సాగారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ ముగిసింది. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈ క్రమంలోనే మళ్లీ రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లోకి వచ్చేస్తాడా లేదా అనే విషయంపై ఆసక్తి ఉంది. అయితే ఇటీవల కాలంలో అన్ని టీమ్స్ కూడా టి20 ఫార్మాట్లో కుర్రాళ్ళకే పెద్ద పీట వేస్తూ ఉన్నాయి. దీంతో టీమ్ ఇండియా సెలెక్టర్లు కూడా ఇదే ప్లాన్ తో ముందుకు సాగే అవకాశం ఉంది. జట్టులో యంగ్ ప్లేయర్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అయితే ఒకవేళ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో టీమిండియా అనుకున్న స్థాయిలో రాణించకపోతే మాత్రం మరోసారి సెలెక్టర్లు ఇక టి20 లలో ఆడేందుకు రోహిత్ ని పంపించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రోహిత్ టెస్టుల పైన ఫోకస్ చేశాడని.. ఇక డబ్ల్యూటీసి 2025 పైన దృష్టి సారించినట్లు బిసిసిఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి