గత కొంతకాలం నుంచి భారత జట్టును మిడిల్ ఆర్డర్ తీవ్రంగా వేధిస్తుంది అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే గతంలో మహేంద్రసింగ్ ధోని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన సమయంలో.. అందరూ టాప్ ఆర్డర్లు బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చి తన బ్యాటింగ్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇక భారత జట్టుకు ఇలాంటి ఫినిషర్ లేకుండా పోయాడు అని చెప్పాలి. అయితే ఇక బిసిసిఐ ఇలా మిడిల్ ఆర్డర్లో ఎంతోమంది ఆటగాళ్లను ప్రయత్నిస్తున్న కొంతమంది ఆటగాళ్లు అప్పుడప్పుడు మెరుపులు మెరూపిస్తూ అందరిని నమ్మకాన్ని కలిగిస్తున్న.. ఆ తర్వాత మాత్రం మళ్ళీ నిరాశ పరుస్తూనే ఉన్నారు.


 దీంతో ఇలా మిడిల్ ఆర్డర్ సమస్య మళ్లీ భారత జట్టుకు మొదటికి వచ్చేస్తుంది. అయితే ఇలాంటి మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ సమస్య ఉంది కాబట్టే గతంలో ఐపీఎల్ లో బాగా రానించిన దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ బ్యాట్స్మెన్ ను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. కానీ అతను కూడా ఎక్కడ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. కానీ గత ఐపీఎల్ సీజర్ నుంచి ఒక యంగ్ ప్లేయర్ మాత్రం ఇక తానే టీమ్ ఇండియాకు ఫ్యూచర్ ఫినిషర్ అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా  అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఎంతో దూకుడైన బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు.


 ఏకంగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ఒకే ఒక ఇన్నింగ్స్ తో వెలుగులోకి వచ్చిన  యంగ్ క్రికెటర్ రింగు సింగ్.. ఆ తర్వాత కూడా తన బ్యాటింగ్లో అదే ఊపును కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడిన మ్యాచ్లో కూడా అదే రీతిలో అదరగొట్టాడు ద ఫినిషర్ రింకు సింగ్. భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడిన సమయంలో క్రీజూలోకి వచ్చి 14 బంతుల్లో 22 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు బౌండరీలు ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ చూసి అతనే ఫ్యూచర్ ఫినిషర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: