అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇలా ఐపిఎల్ టోర్నీ వీక్షిస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు అని చెప్పాలి. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ఎంతో విజయవంతంగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం సన్నాహాలు మొదలయ్యయ్. డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి అన్ని టీమ్స్ కూడా తమ జట్టు నుంచి వదిలేయబోయే ఆటగాళ్ల వివరాలను సమర్పించాయి. ఇక ఏ టీం ఎవరిని కొనుగోలు చేయబోతుంది. ఏ ఆటగాడు అత్యధిక ధర పలకబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.
ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ మాత్రం ఇతర జట్లతో సంప్రదింపులు జరిపి తమ జట్టులోని ఒక ప్లేయర్ ను ఇతర జట్టులోని మరో ప్లేయర్ తో మార్చుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు టీమ్స్ కూడా ఇలా ఆటగాళ్లను మార్చుకున్నాయి. మయాంక్ డాగర్ ను ఆర్సిబి, శాబాజ్ అహ్మద్ ను సన్రైజర్స్ తీసుకున్నాయ్. గత ఏడాది వేలంలో డాగర్ ను హైదరాబాద్ 1.8 కోట్లకు శాబాజ్ ను బెంగళూరు 2.4 కోట్లకు సొంతం చేసుకోగా.. ఇప్పుడు అదే ధరకు ఈ ఇరు జట్లు ఆటగాళ్లను మార్చుకున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి