మొన్నటికి మొన్న వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి అందరిని నిరాశలో ముంచేసిన టీమ్ ఇండియా.. ఇక ఇప్పుడు అదే ఆస్ట్రేలియాతో జరుగుతున్న t20 సిరీస్ లో మాత్రం అదరగొడుతూ వరుస విజయాలు సాధిస్తూ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంది అని చెప్పాలి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయ్. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా ఈ టి20 సిరీస్ లో బరిలోకి దిగింది.


 అయితే వరల్డ్ కప్ ఆడిన ఎంతో మంది సీనియర్లు ఇక ఇప్పుడు టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతున్నారు. అనుభవం గల సీనియర్ క్రికెటర్లను ఎదుర్కొని అటు భారత యంగ్ ప్లేయర్లు నిలబడి తడబడటం కాస్త కష్టమే అని అందరూ అనుకున్న.. ఏకంగా సీనియర్లకే చెమటలు పట్టిస్తున్నారు భారత కుర్రాళ్ళు. మొదటి మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్ లోను ఇదే జోరును కొనసాగించింది. భారత బ్యాట్స్మెన్ల విధ్వంసం ముందు ఆస్ట్రేలియా బౌలర్లు మొత్తం తేలిపోతున్నారు. పరుగులను కట్టడి చేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు.


 కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియగా.. నేడు మూడో టి20 మ్యాచ్ జరగబోతుంది. గుహవాటి వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మూడో టి20 ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో గెలిచి మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇక అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో జట్టులో.. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ఇక సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని అనుకుంటుంది ఆస్ట్రేలియా.

మరింత సమాచారం తెలుసుకోండి: