2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు అందరి అంచనాలను తారుమారు చేసింది. వరుస విజయాలతో దూసుకుపోయి.. ఈసారి టైటిల్ కొట్టడం పక్క అని అందరూ అనుకుంటున్న వేళ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఓడిపోయింది. అయితే ఇలా ఫైనల్లో ఓడిపోయినప్పుడు ఎలా అయితే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశలో మునిగిపోయారో.. 2019లో సెమీఫైనల్ లో ధోని రన్ అవుట్ అయిన సమయంలో కూడా ఇదే బాధను అనుభవించారు అని చెప్పాలి.


 ధోని క్రీజ్ లో ఉన్నంత సేపు టీమిండియా తప్పకుండా సెమి ఫైనల్ మ్యాచ్లో గెలుస్తుంది అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ధోని కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఏకంగా ధోని ఒక షాట్ కొట్టి రెండు పరుగులకి  ప్రయత్నించగా.. చివరికి రెండో రన్ తీసే క్రమంలో రన్ అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గాప్తిల్ మెరుపు త్రో విసరడంతో ధోని లాంటి ప్లేయర్ సైతం ఇక రన్ అవుట్ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ రన్ అవుట్ తో ఏకంగా భారత క్రికెటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.


 ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇటీవల ఇలా ధోనిని రనౌట్ చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గాప్తిల్   2019 వరల్డ్ కప్ రన్ అవుట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ధోనిని రనౌట్ చేసినందుకు ఇప్పటికీ కూడా భారత అభిమానులు నన్ను ద్వేషిస్తున్నారని చెప్పుకొచ్చాడు. సెమీ ఫైనల్లో ధోనిని డైరెక్ట్ త్రో వేసి రన్ అవుట్ చేశా. ఇది అద్భుతమైన త్రోని విశ్లేషకులు కొనియాడారు. కానీ భారత అభిమానుల నుంచి ఇప్పటికి ద్వేషపూరిత మెసేజ్లు వస్తున్నాయి అంటూ వెల్లడించాడు. కాగా అతను చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: