2023 వన్డే వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఈ వరల్డ్ కప్ లో టైటిల్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ టీమ్ ఇండియాకు నిరాశ ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చిన టీమిండియా.. ఫైనల్ పోరులో మాత్రం బోల్తా పడింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి.. టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా టీమ్ ఇండియా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి ఒక ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది.


 భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా ఇక టీమిండియాని నడిపించే రెండు పిల్లర్లుగా కొనసాగుతూ ఉన్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు. అయితే గత కొంతకాలం నుంచి ఈ సీనియర్ ప్లేయర్లు టి20 ఫార్మాట్ కు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు మళ్లీ టి20లోకి వస్తారా.. ఒకవేళ వచ్చిన టి20 వరల్డ్ కప్ నాటికి జట్టులో కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు టి20 వరల్డ్ కప్ ఆడబోతుంది అని కొంతమంది అంటుంటే.. ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకుండా టీమిండియా రాణించడం కష్టమని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



 అయితే ఇదే విషయం గురించి వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2024 t20 వరల్డ్ కప్ లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయకపోతే.. అది బిసిసిఐ పిచ్చితనమే అవుతుంది అంటూ రస్సెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిద్దరూ చాలా అనుభవం ఉన్న ప్లేయర్లు. వరల్డ్ కప్ మొత్తం యంగ్ ప్లేయర్లను పంపకూడదు. ఒత్తిడి పరిస్థితులను వారు తట్టుకోలేరు అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇప్పటికైతే టి20 ఫార్మాట్లో కేవలం యంగ్ ప్లేయర్స్ మాత్రమే అవకాశం ఇస్తూ వస్తుంది బీసీసీఐ. మరి మరికొన్ని రోజుల్లో రోహిత్, కోహ్లీలు టి20 ఫార్మాట్లోకి వస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: