ఇటీవల కాలంలో వరల్డ్ క్రికెట్లో కొత్త ట్రెండు నడుస్తుంది. ఒక ఫార్మాట్లో ఆడుతున్న ఆటగాడివి మరో ఫార్మాట్లో పక్కన పెట్టడం చేస్తూ వస్తున్నారు సెలెక్టర్లు. ఇలా ఒక ఆటగాడిని కేవలం ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమితం చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కేవలం ప్లేయర్లను మాత్రమే కాదు అటు జట్టుకు కెప్టెన్ గా ఉన్న వారిని సైతం ఒక్కో ఫార్మాట్ కి ప్రత్యేకంగా నియమిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ప్రతి చోట ఇలాంటి సాంప్రదాయం కనిపిస్తుంది. కానీ భారత జట్టులో మాత్రం ఇంకా ఇలాంటి ట్రెండ్ మొదలు కాలేదు.


 వరల్డ్ క్రికెట్లో ఉన్న అన్ని టీమ్స్ కి ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కెప్టెన్ నూ కొనసాగిస్తుంటే.. భారత క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో భారత జట్టు  ఏదైనా పర్యటనకు వెళ్తూ అక్కడ మూడు ఫార్మాట్లలో సిరీస్ ఆడుతుంది అంటే ఒక్కో ఫార్మాట్ కి సపరేట్గా టీమ్స్ ని ప్రకటిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం  అయితే ఇక మరికొన్ని రోజుల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లబోతుంది. అక్కడ మూడు ఫార్మాట్ లలో కూడా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోతుంది.


 దీంతో ఇక ఈ ఒక్కో ఫార్మాట్ కి ప్రత్యేకమైన టీమ్ ను బీసీసీఐ ప్రకటించింది అని చెప్పాలి. దాదాపుగా అందరూ ఆటగాళ్లు కూడా ఒక్కో ఫార్మాట్ కే పరిమితమయ్యారు. కానీ ముగ్గురు ప్లేయర్లు మాత్రం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. వాళ్ళు ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్, ఋతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ డిసెంబర్ 10వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం అవుతుండగా టెస్టులకు రోహిత్ శర్మ వన్డేలకు కేఎల్ రాహుల్ టి20 లకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: