సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఏం జరుగుతుంది అని ముందుగా ఊహించడం చాలా కష్టం. ఇక ఎవరి కెరియర్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో ఊహించడం కూడా కష్టమే. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేసికిట్టు కొట్టడం కూడా ఇండస్ట్రీలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి విషయాలు చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.  ఇక ఇప్పుడు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమాని మహేష్ బాబు చేసి సూపర్ హిట్ కొట్టాడట. ఆ మూవీ ఏదో కాదు మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మరో హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది.


 అయితే వాస్తవానికి ఈ మూవీ మహేష్ బాబు చేయాల్సింది కాదట. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ముందుగా ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని అనుకున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్కు కథ కూడా వినిపించాడట. తారక్ కథ నచ్చడంతో ఓకే చెప్పాడు. కానీ అప్పుడు బిజీ షెడ్యూల్ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడట. దీంతో ఇక తారక్ తో సినిమా అంటే రెండేళ్ల పాటు ఆగాల్సి రావడంతో ఇక రాత్రికి రాత్రే మహేష్ బాబుతో చర్చలు జరిపి.. ఇక ఈ మూవీని సూపర్ స్టార్ తో చూసేందుకు రెడీ అయ్యాడట వంశీ పైడిపల్లి. ఇలా ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాని మహేష్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: