
తమ ఆట తీరుతో కోట్ల మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా క్రేజ్ సంపాదించుకునే క్రికెటర్ కు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. కాగా ఇప్పుడు భారత యంగ్ ప్లేయర్ ఏకంగా ఒక ఇంటివాడు కాబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. అతను ఎవరో కాదు భారత యువ ఫేసర్ చేతన్ సకారియా.అతను మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
ఇటీవలే అతని నిశ్చితార్థం కూడా జరిగింది. మేఘన జంబుచా తో చేతన్ సకారియాకు నిశ్చితార్థం జరగడం గమనార్హం ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమనులతో పంచుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్ కలిసి ముందడుగు వేయబోతున్నాం అనే క్యాప్షన్ తో ఇక ఈ ఫోటోలను పోస్ట్ చేశాడు అని చెప్పాలి. కాగా అతను 2021లో వన్డే, t20 లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్, ఢిల్లీ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.