ఇండియా వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్  భారత జట్టుకు ట్రంప్ కార్డు అవుతాడు అనుకుంటే.. నాలుగు మ్యాచ్లు ఆడాడో లేదో గాయం బారిన పడి చివరికి వరల్డ్ కప్ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతన్ని అటు ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ కు కూడా ఆడించలేదు బీసీసీఐ. సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా అతన్ని ఎంపిక చేయలేదు అనే విషయం తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా పర్యటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే సిరీస్ లోనూ హార్దిక్ పాండ్యా ఆడటం లేదు అన్నదే తెలుస్తుంది.


 ఒకవేళ అన్ని కుదిరితే అతడు వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ రి ఎంట్రీ కోసం బీసీసీఐ భారీ ప్లాన్ వేసింది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి 18 వారాలు పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబోతుందట. బిసిసిఐ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో నిపుణుల సమక్షంలో హార్దిక్ 18 వారాలపాటు హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రాం పొందబోతున్నాడట.


 ఇదే విషయంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పని భారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు కామన్. అయితే టీ20 క్రికెటర్ గా పాండ్య సామర్థ్యం పై మాకు సందేహం లేదు. కానీ దీర్ఘకాలంలో హార్దిక్ సేవలను వినియోగించుకోవాలంటే మాత్రం అతనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం టీమిండియాలో కొత్తేం కాదు. గతంలో బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కి కూడా బీసీసీఐ ఇలాంటి ట్రైనింగ్ ఇప్పించింది. అయితే వచ్చే ఏడాది జులై లో అమెరికా వెస్టిండీస్ లో జరిగే టి20 వరల్డ్ కప్ నాటికి పాండ్యని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలి అన్నదే బీసీసీఐ ప్రధాన ఉద్దేశం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: