టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా రోహిత్ సుపరిచితుడే. అంతలా తన ఆటతీరుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ జట్టు విజయాల కోసం వీరోచిత పోరాటం చేస్తూ ఉండేవాడు రోహిత్ శర్మ. అయితే ఇక ఇప్పుడు ఆటగాడిగా మాత్రమే కాదు సారధిగా కూడా జట్టును విజయపతంలో ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పాలి.


 అయితే భారత జట్టు తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగే రోహిత్ శర్మ బ్యాటింగ్లో సృష్టించే విధ్వంసం గురించి మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు  పుట్టించడంలో  రోహిత్ శర్మను మించిన బ్యాట్స్మెన్ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఏకంగా స్కోర్ బోర్డుకు సైతం ఆయాసం వచ్చే విధంగా పరుగులు చేస్తూ దూసుకుపోతూ ఉంటాడు. అందుకే ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఎప్పుడు మంచి ర్యాంకును సొంతం చేసుకుంటూ ఉంటాడు రోహిత్ శర్మ.



 అయితే ఇప్పటికే ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్న రోహిత్ శర్మ.. ఇక ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లోను సత్తా చాటాడు అని చెప్పాలి. ఏకంగా ఈ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాడు. ఇక మరో విశేషం ఏమిటంటే.. ఇలా టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్న ఏకైక భారత ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. కేన్ విలియమ్సన్, రూట్, స్మిత్ తొలి మూడు స్థానాల్లో ఉండగా రోహిత్ పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్లలో జడేజా మొదటి స్థానంలో ఉంటే ఇక బౌలర్లలో అశ్విన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: