ఒకవైపు భారత పురుషుల జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అదరగొడుతుంది. ఇంకో వైపు పురుషుల టీం కి తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తుంది మహిళల జట్టు. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది భారత మహిళలు జట్టు. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్వదేశీ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది.


 ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో సొంత గడ్డపై తమకు తిరుగులేదు అని నిరూపిస్తుంది భారత జట్టు. ఏకంగా ప్రతి మ్యాచ్ లోను పైచేయి సాధిస్తూ అదరగొడుతుంది. ఇక ఇటీవలే జరిగిన టెస్ట్ మ్యాచ్లో అయితే చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత మహిళల జట్టు. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి  ఇటీవలే ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల టీం తో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో 347 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా.


 ఇక ఇదే మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు తేడాతో సాధించిన విజయం కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 136 రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేసి కుప్పకూలింది. ఇక భారత బౌలర్లు రాణించడంతో ఎక్కడ ఇంగ్లాండ్ పరుగులు చేయలేకపోయింది అని చెప్పాలి.  ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్ దీప్తి శర్మ ఏకంగా తొమ్మిది వికెట్లు తీసి సత్తా చాటింది. ఒకరకంగా ఇంగ్లాండ్ ఓటమిని దీప్తి శర్మ శాసించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇంత భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: