ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసిన ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుండి  తప్పించడమే. రోహిత్ అంటే ముంబై.. ముంబై అంటే రోహిత్ అనే విధంగా ఐపీఎల్ లో ప్రస్థానం కొనసాగింది. కానీ ఊహించని రీతిలో సూపర్ సక్సెస్ అయిన రోహిత్ శర్మ పై వేటు వేసింది జట్టు యాజమాన్యం. హార్దిక్ పాండ్యా చేతికి సారధ్య బాధ్యతలు అప్పగించింది అన్న విషయం తెలిసిందే.


 ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకుని నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అభిమానులు. అయితే ఇక ఈ నిర్ణయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. కెప్టెన్గా రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్ ని చూడలేము అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇకనుంచి అటు ముంబై జట్టుకు మద్దతు పలకలేము అంటూ పోస్టులు పెడుతున్నారు ఎంతో మంది రోహిత్ శర్మ అభిమానులు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగిస్తూ హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఇక ఆ జట్టు ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.



 ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాలో హార్ట్ బ్రేక్ ఎమోజిని పోస్ట్ చేశాడు సూర్య కుమార్ యాదవ్. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం తోనే సూర్య కుమార్ యాదవ్ బాధపడి ఇలా రియాక్ట్ అయ్యాడు అని రోహిత్ ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే గత కొన్నెళ్ల నుంచి రోహిత్ శర్మ సూర్య కుమార్ యాదవ్ లు ముంబై ఇండియన్స్ కోసం కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ మార్పు నిర్ణయం సూర్యకు మింగుడు పడటం లేదని.. అతను కూడా అభిమానులలాగానే ఈ కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నాడని ఎంతోమంది రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: