ముందుగా ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడి మరి 20.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఇదే అత్యధిక ధర అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో.. మరో సంచలనం నమోదయింది. అదే జట్టుకు చెందిన మరో స్టార్ బౌలర్ స్టార్క్ 24.75 కోట్లకు కోల్కత్తా దక్కించుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రికార్డు స్థాయి ధర గురించే ప్రస్తుతం భారత క్రికెట్ లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక శాలరీలు అందుకున్న టాప్ టెన్ ప్లేయర్లు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో స్టార్క్ దక్కించుకున్న 24.75 కోట్ల అత్యధికంగా ఉండగా.. ఇక ఆ తర్వాత కామెంట్స్ 20.50 కోట్లతో ఎక్కువ శాలరీ అందుకున్న ప్లేయర్గా టాప్ 2 లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత గత ఏడాది రికార్డు స్థాయి ధర పలికిన శాంకరణ్ 18.50కోట్లతో మూడో స్థానంలో కామరూన్ గ్రీన్ 17.500కోట్లతో నాలుగవ స్థానంలో.. కేఎల్ రాహుల్ 17 కోట్లు ఐదో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రసేల్, పూరన్ ఇక 16 కోట్లు దక్కించుకొని అత్యధిక శాలరీలు అందుకున్న ప్లేయర్లలో టాప్ 10 లో నిలిచారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి