దీంతో ఇక మొదటి మ్యాచ్ లో గెలిచి జోరు మీద ఉన్న టీమ్ ఇండియాకు.. రెండో మ్యాచ్ లోనే చెక్ పెట్టింది సౌత్ ఆఫ్రికా జట్టు. అయితే ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా 1-1 తో సమంగా ఉంది. ఇక సిరీస్ గెలుచుకోవాలి అంటే ఈ రెండు టీమ్స్ కి కూడా ఒకే రకమైన అవకాశం ఉంది అని చెప్పాలి. కాగా నేడు మూడో మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో గెలిచి తప్పక సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది అని చెప్పాలి. కాగా ఫామ్ కోల్పోయిన తిలక్ వర్మ స్థానంలో మధ్యప్రదేశ్ బ్యాట్స్మెన్ రజాక్ పాటిదార్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే రెండో వన్డే మ్యాచ్లో సాధించిన విజయంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. ఓపెనర్ టోనీ జోర్జీ ఏకంగా సెంచరీ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టుపై విజయం సాధించాలి అంటే బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో రానించి టీమ్ ఇండియా సమిష్టిగా రానిస్తేనే సాధ్యమవుతుంది. మరి నేడు జరగబోయే మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి . కాగా మూడో వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న పార్ల్ లో భారత్ పై దక్షిణాఫ్రికాదే ఫై చేయిగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి