టి20 ఫార్మాట్ లో ఇప్పటికే తాను బెస్ట్ స్పిన్నర్ అనే నిరూపించుకున్న ఇతని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇటీవలే ఐపీఎల్లో ఫ్రాంచైజీలు పట్టించుకోకుండా పక్కన పెట్టిన ఈ స్పిన్నర్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఇటీవల ఐసీసీ t20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. ఇక ఈ ర్యాంకింగ్స్ లో అదిల్ రషీద్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లాండు నుంచి పొట్టి క్రికెట్లో ఇలా నెంబర్ వన్ బౌలర్ ర్యాంకును సంపాదించుకున్న రెండో స్పిన్నర్ గా నిలిచాడు అని చెప్పాలి.
గతంలో గ్రేమ్ స్పాన్ మాత్రమే ఇంగ్లాండ్ తరఫున t20 లలో ఇక ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్గా స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రషీద్ వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్లలో కూడా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత యువ స్పిన్నర్ రవి బిష్ణయ్ లను వెనక్కి నెట్టి టాప్ లోకి వచ్చేసాడు. ఇక ఈ జాబితాలో హసరంగా, మహిష్ తీక్షన టాప్ ఫైవ్ లో బౌలర్ల లిస్టులో ఉన్నారు అని చెప్పాలి. ఇక బ్యాట్స్మెన్ లిస్టులో సూర్య కుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి