ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటిసారి భారత జట్టు మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లతో బరిలోకి దిగింది. టీ20 ఫార్మాట్ కు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహించగా.  వన్డే ఫార్మాట్కు కేఎల్ రాహుల్ ఇక టెస్టు ఫార్మాట్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పటికే t20 వన్డే ఫార్మాట్లను ముగించుకుంది టీం ఇండియా. జనవరి 26వ తేదీ నుంచి కూడా టెస్ట్ ఫార్మాట్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి.


 అయితే టి20, వన్డే ఫార్మట్లలో సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించడంతో ఎంతోమంది యువ ఆటగాళ్లకు చాన్స్ దక్కింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇలా టీమ్ ఇండియాలో అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్లు.. తమ ఆట తీరుతో అదరగొడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఛాన్స్ దక్కించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ అయితే మెరుపులాంటి బంతులు విసురుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఈ వన్డే సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అర్షదీప్. ఇలా తన బౌలింగ్ తో ఆకట్టుకున్న అర్షదీప్  పలు రికార్డులు నమోదు చేశాడు. సౌత్ ఆఫ్రికా తో ఆడిన వన్డే మ్యాచ్ లలో 4 కంటే ఎక్కువ వికెట్లు రెండుసార్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు  ఇక ఇందులో చాహల్, కుల్దీప్ మూడుసార్లు ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్నారూ అని చెప్పాలి  అంతేకాదు ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. కాగా 2011లో మూనాఫ్ పటేల్ 11 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: