విమర్శలు అంటే అలాంటి ఇలాంటి విమర్శలు కాదు ఏకంగా పర్సనల్ విషయాలను కూడా తెరమీదకి తీసుకువస్తూ దారుణంగా ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అభిమానం పరిమితి వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక ఇలా అభిమానులు అత్యుత్సాహంతో ఏకంగా ప్రత్యర్థి ప్లేయర్లకు కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే తనకు భారత క్రికెట్ అభిమానుల నుంచి ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది అంటూ చెబుతున్నాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రీజ్ షంశి.
ఏకంగా తన భార్యను కూడా టార్గెట్ చేస్తూ దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అంటూ ఇటీవల చేదు అనుభవాని చెప్పుకొచ్చాడు. ఏకంగా తన భార్యను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. డిసెంబర్ 12న జరిగిన రెండవ టి20 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో బెదిరింపు పోస్టులు పెట్టారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ మ్యాచ్ లో వికెట్ తీసిన షంశి వినూత్నమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఈ సెలబ్రేషన్స్ నచ్చకే భారత క్రికెట్ ఫ్యాన్స్ అతన్ని ట్రోల్ చేశారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి