గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఒక విషయంపై తీవ్ర స్థాయిలో జరుగుతుంది. 2024 t20 వరల్డ్ కప్ కోసం సీనియర్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ పొట్టి ఫార్మాట్లోకి వస్తారా లేదా అనే విషయంపై. ఎందుకంటే ఇక గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు టి20 ఫార్మాట్ కు పూర్తిగా దూరంగానే ఉన్నారు. 2022 t20 వరల్డ్ కప్ నాటి నుంచి కూడా ఈ ఇద్దరు పొట్టి   ఫార్మాట్ కు అందుబాటులో లేరు. ఈ క్రమంలోనే ఇక హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్ గా టి20 ఫార్మాట్ ను ముందుకు నడిపిస్తున్నాడు.


 అయితే ఇక 2024వ t20 వరల్డ్ కప్ కోసం ఈ ఇద్దరు సీనియర్లు భారత జట్టులోకి వస్తేనే బాగుంటుందని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇద్దరు సీనియర్ లేకుండా భారత జట్టు బాగా రాణించలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక కోహ్లీ, రోహిత్ లు టి20 ఫార్మాట్లోకి వస్తారా లేదా అనే విషయంపై మాత్రం గత కొంతకాలం నుంచి ప్రతి ఒక్కరిలో కూడా కన్ఫ్యూషన్ నెలకొంది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు టి20 వరల్డ్ కప్ లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ లో జరగబోయే  మెగా టోర్నీలో వీరిద్దరూ ఆడాలని ఆసక్తి కనబరిస్తున్నారట. దీంతో ఇక త్వరలోనే ఇద్దరు సీనియర్ క్రికెటర్లను కూడా టి20 ఫార్మాట్లో చూసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కాగా కొంతకాలం నుంచి ఇద్దరు సీనియర్ ప్లేయర్ల స్థానంలో కుర్రాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరు సీనియర్ల రిటైర్మెంట్ ఉంటుంది అనుకున్నప్పటికీ.. అది కుదరలేదు. కనీసం టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అయినా ఘనమైన వీడ్కోలు దక్కించుకోవాలని సీనియర్ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: