పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొంతకాలం నుంచి వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. దీనికి కారణం అతని ఆట తీరు కాదు ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తో ఇటీవల విడాకులు తీసుకోవడమే అని చెప్పాలి. అయితే ఏకంగా షోయబ్ మాలిక్ కోసం దేశాన్ని ఎదిరించి మరి ఇక పెళ్లి చేసుకున్న సానియా మీర్జాకు.. చివరికి విడాకులు ఇచ్చాడు షోయబ్ మాలిక్. అంతేకాదు ఇక విడాకుల వార్త బయటకు వచ్చిందో లేదో అంతలోనే ఇక షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన వార్త కూడా తెరమీదకి వచ్చింది.


 ఇలా విడాకుల విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన షోయబ్ మాలిక్ ఇక చెత్త ప్రదర్శన ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు ఈ పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్. అయితే ఇటీవల ఏకంగా మూడు నోబాల్స్ వేశాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం చూస్తూ ఉంటాం. ఏకంగా ఒక ఓవర్ లో ఒక నోబాల్ వేయడమే గొప్ప. అలాంటిది ఏకంగా స్పిన్నర్ అయినా షోయబ్ మాలిక్ మాత్రం ఏకంగా ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేశాడు.


 అయితే స్పిన్నర్లు నోబాల్ వేయడాన్ని అటు ఒక పెద్ద నేరంగా అభిమానిస్తూ ఉంటారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు షోయబ్ మాలిక్ ఏకంగా ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేయడంతో అతన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఏకంగా అతని మూడు పెళ్లిళ్లకు గుర్తుగా అతను ఇలా మ్యాచ్ లో మూడు నోబాల్స్ వేసి ఉంటాడు అంటూ ఎంతో మంది సెటైర్లు కూడా వేస్తూ ఉండడం గమనార్హం. అయితే గతంలో అతను టి20 వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే ఇలాంటి ఆటతీరుతో ఇక టి20 వరల్డ్ కప్ ఆడితే పాకిస్తాన్ జట్టు పరిస్థితి అంతే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: