వరల్డ్ క్రికెట్లో టీమిండియాకు చిరకాల ప్రత్యర్థి గా కొనసాగుతుంది పాకిస్తాన్. అయితే గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి. ఏకంగా పాకిస్తాన్ జట్టు గత ఏడాది ఇండియా వేదిక జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో దారుణం గా విఫలం కావడం తో.. ఏకంగా బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త సారదులను నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. వరుసగా దారుణమైన పరాజయాలతో సతమతమవుతూనే ఉంది.


 ఇలాంటి సమయం లోనే పాకిస్తాన్ క్రికెట్ ను ఇక బాగు చేయడం నావల్ల కాదు బాబోయ్ అని అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న జాకా ఆశ్రఫ్ చేతు లెత్తేశారు. ఏకంగా పాకిస్తాన్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అని చెప్పాలి. దీంతో పాకిస్తాన్ క్రికెట్లో మరింత సంక్షోభం నిండి పోయింది. ఇలాంటి సమయం లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితుల అవుతారు అనే విషయం పై కూడా చర్చ జరిగింది అని చెప్పాలి. అయితే ఇటీవల ఏకం గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తాత్కాలిక చైర్మన్ నియమించారు పాక్ ప్రధాని అన్వారుల్ హక్ కాకర్.


 పాకిస్తాన్ క్రికెట్ క్రికెట్ బోర్డు కు తాత్కాలిక చైర్మన్గా  షా ఖవార్ నియమితులు అయ్యారు. ఈ మేరకు పాకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. షా కవార్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం షా కవర్ తాత్కాలిక చైర్మన్గా మాత్రమే ఉండగా.. ఇక వచ్చే నెలలో పూర్తిస్థాయి క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఈసారి ఎవరు ఇలా క్రికెట్ బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: