సాధారణంగా క్రికెట్లో ఎవరైనా ఆటగాడు అదిరిపోయే ప్రదర్శన చేసి సూపర్ సెంచరీ చేశాడు అంటే చాలు ఇక అతనిగురించి అందరూ చర్చించుకోవడం చేస్తూ ఉంటారు. ఇక తన అద్భుతమైన ఇన్నింగ్స్ పై మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రోజు సెంచరీ చేస్తే.. అది ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోవడం ఖాయం అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు సెంచరీ తో చెలరేగిపోయారు. ఏకంగా భారత జట్టు విజయాలలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి.


 అయితే ప్రస్తుతం కొంతమంది యంగ్ ప్లేయర్లు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. ఇక కొంతమంది ప్లేయర్లు ఇంగ్లాండు లయన్స్ తో ఇండియా ఏ తరఫున ఆడుతూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టీమ్స్ లో కూడా ఇద్దరు అన్నదమ్ములు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ప్లేయర్లు ఇటీవల సెంచరీ తో చెలరేగిపోయారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో కాదు దేశవాళి సెన్సేషనల్ బ్యాట్స్మెన్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ఇక అతని సోదరుడు ముషీర్ ఖాన్. ఇద్దరు కూడా భారత తరఫున ఓకే రోజు సెంచరీలు చేశారు.


 టీమిండియా ఏ జట్టు తరుపున ప్రస్తుతం సర్పరాజ్ కాన్ఖాన్ ఆడుతూ ఉన్నాడు. కాగా ఇటీవల ఇంగ్లాండు లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 160 బంతుల్లో 161 పరుగులు చేసి రాణించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇక మరోవైపు అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ 106 బంతుల్లో 111 పరుగులు చేశాడు. అయితే ఈ రెండు సెంచరీలతో ఖాన్ బ్రదర్స్ అరుదైన రికార్డును సృష్టించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: