ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ ఎందుకో క్రికెటర్లనే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు క్రీడాభిమానులు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇలా క్రికెటర్ల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 మరీ ముఖ్యంగా క్రికెటర్ల ప్రేమాయణంకు సంబంధించిన వార్త ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా మహిళా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న స్మృతి మందాన ప్రేమలో మునిగి తేలుతుంది అన్న వార్త ఇంటర్నెట్ను షేర్ చేస్తుంది. దీంతో ఇక స్మృతి మందాన బాయ్ ఫ్రెండ్ ఎవరు అని సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు నెటిజెన్స్. ఇంతలోనే బాలీవుడ్ గాయని పలక్ ముత్యాలు సోదరుడు ఫలాష్ ముచ్చల్ తో స్మృతి మందాన డేటింగ్ లో ఉందనే వార్తా తెర మీదకి వచ్చింది.


 సాధారణంగా సెలబ్రిటీలపై ఇలాంటి వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఎవరికి తెలియదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో స్మృతి మందాన, ఫలాష్ ముచ్చల్ ప్రేమాయణం నిజమే అని బలాన్ని ఇచ్చే విధంగా కొన్ని ఘటనలు జరిగాయి. పలు సందర్భాల్లో ఓపెనర్ స్మృతి మందాన, పలాస్ ముచల్ కలిసి కెమెరా కంట పడ్డారు. అయితే ఇటీవల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా అవార్డు దక్కించుకుంది స్మృతి మందాన. అయితే ఇదే విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన పలాష్ ముచ్చల్ ఏకంగా ఆమెకి శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారు అన్న దానికి ఇది మరింత బలాన్ని ఇచ్చింది. అయితే త్వరలోనే వీరు ఏడడుగులు కూడా వేయబోతున్నారు అనే రూమర్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: