క్రికెట్ ను ఫన్నీ గేమ్ అని అభివర్ణిస్తూ ఉంటారు విశ్లేషకులు. అయితే క్రికెట్లో జరిగే కొన్ని కొన్ని ఫన్నీ ఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతూ ప్రేక్షకులందరికీ కన్నారపకుండా చేయడమే కాదు ఇంకొన్నిసార్లు ఏకంగా మ్యాచ్ మధ్యలో జరిగే కొన్ని సంఘటనలతో నవ్వుకునేలా కూడా చేస్తూ ఉంటుంది క్రికెట్. అయితే ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో క్రికెట్లో ఎక్కడ చూసినా ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగయ్యాయి. దీంతో గల్లి క్రికెట్ నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ వరకు అందరూ కూడా ఫీల్డింగ్ లో  అదరగొట్టేస్తూ ఉంటారు. దాదాపుగా ప్రొఫెషనల్ క్రికెట్ ను చూస్తున్నామేమో అనేంతలా డెడికేషన్ తో క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం క్రికెట్ మ్యాచ్ లో జరిగిన ఒక ఘటన చూస్తే.. అక్కడ జరుగుతుంది క్రికెట్ మ్యాచ్ లేకపోతే ఒక కామెడీ షోనా అనే అనుమానం కలుగుతుంది.


 అయితే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలోనీ మ్యాచ్ ఒక లీగ్ లో జరిగింది అనేది తెలుస్తుంది. అయితే మీటి వికెట్ వైపు బంతిని షాట్ ఆడాడు బ్యాటర్. రెండు పరుగులు చేసేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక బ్యాట్స్మెన్ రన్ అవుట్ చేసే అవకాశం వచ్చింది. వికెట్ కీపర్ బంతి అందుకొని వికెట్లను కొట్టేలోపు ఆ బ్యాటర్ క్రీజులోకి వస్తాడు. దీంతో రన్ అవుట్ అవకాశం మిస్ అవుతుంది. మరో ఎండ్ ఉన్న ఆటగాడు సైతం అక్కడికి చేరుకున్నాడు.   అయితే ఇదంతా జరుగుతూ ఉండగా మూడో బ్యాట్స్మెన్ పిచ్ మధ్యకు వచ్చి ఆటగాళ్లను పరుగులు చేయమని ప్రోత్సహిస్తాడు. దీంతో ఇది చూసిన అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇద్దరు పరిగెత్తడం ఓకే కానీ ఈ మూడో బ్యాట్స్మెన్ ఎక్కడ నుంచి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: