సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న ప్రతి ఆటగాడు కూడా ఎప్పుడు క్రీడా స్ఫూర్తితోనే వ్యవహరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే విజయం సాధించినప్పుడు పొంగిపోవడం ఇక ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోవడం ఆటగాళ్లలో ఎప్పటికీ కనిపించకూడదు. ఇక జయాపజాయాలను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్ల కెరియర్ ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు ఆడే చాలామంది ప్లేయర్లు ఇలాంటి క్రీడా స్ఫూర్తిని చూపిస్తూ ఉంటారు.


 విజయం వరించినా పరాజయం పాలు అయినా ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు కొంతమంది క్రికెటర్లు కంట్రోల్ లాస్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐసిసి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా క్రికెటర్ ఇలా నిబంధనలో ఉల్లంఘిస్తే వారి విషయంలో ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఇలా రూల్స్ అతిక్రమించిన వారు ఎంతటి స్టార్ క్రికెటర్ అయినా సరే ఐసీసీ మాత్రం ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు చేపడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత స్టార్ బౌలర్ పై ఇటీవల ఐసీసీ చర్యలు తీసుకుంది.
 ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న బుమ్రాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ప్రవర్తన నియమాయపాలని ఉల్లంఘించారు అంటూ డిమెరిట్ పాయింట్ విధించింది. ఐసిసి లెవెల్ వన్ కోడ్ ఉల్లంఘించాడు అంటూ పేర్కొంది. ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ వేసిన తర్వాత బ్యాట్స్మెన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు అంటూ ఐసిసి పేర్కొంది. ఈ క్రమంలోనే ఇక అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 28 పరుగులు తేడాతో ఓటమిపాలు అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: