ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. అది తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులందరికీ కూడా మెప్పించింది. అనివర్గాల ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఇక సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది అన్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ప్రశాంత్ వర్మ యంగ్ హీరోగా కొనసాగుతున్న తేజ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మన సూపర్ హీరో హనుమాన్ పవర్ ఏంటో అందరికీ తెలియజేసింది  మొన్నటి వరకు అందరూ సూపర్ హీరో అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్మాన్, సూపర్ మాన్ అని అనుకునేవారు. కానీ మన దేశంలోనూ చాలా మంది సూపర్ హీరోలు ఉన్నారు అన్న విషయాన్ని ప్రశాంత్ వర్మ తన సినిమాతో మరోసారి అందరికీ గుర్తు చేశాడు.


 ఏకంగా హనుమంతుడి పవర్స్ ఒక సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక ఊహించనీ ట్విస్ట్ కూడా పెట్టి ఇక ఈ మూవీ సీక్వెల్ పై భారీ రేంజ్ లోనే అంచనాలను కూడా పెంచేసాడు. ఏకంగా జై హనుమాన్ మూవీతో హనుమాన్ మూవీకి సీక్వెల్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇక ఈ మూవీని త్వరగా తెరకెక్కించి.. ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను అంటూ తెలిపాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా గురించి ఒక అభిమాని చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. హాయ్ ప్రశాంత్ వర్మ సార్.. నా 88 ఏళ్ల అమ్మమ్మ ఇటీవల ఫ్యామిలీతో కలిసి హనుమాన్ మూవీ చూసింది. ఇక ఈ మూవీ చూసి ఆమె ఎంతో సంతోష పడింది. జై హనుమాన్ మూవీ చూడకుండానే చనిపోతానేమోనని భయం ఆమెకు పట్టుకుంది  ఆమె కోసమైనా సినిమాను త్వరగా తెరకెక్కించి విడుదల చేయండి అంటూ ఒక అభిమాని పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: