ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో బాబర్ అజాం కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తన ఆటతీరుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఎన్నో ఏళ్ల పాటు పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగడమే కాదు కెప్టెన్ గా కూడా హవా నడిపించాడు అన్న విషయం తెలిసిందే. అయితే బాబర్ అజాం గత కొంతకాలం నుంచి మంచి ఫామ్ లో లేకపోయినా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మాత్రం మంచి పొజిషన్లోనే కొనసాగుతూ వస్తూ ఉన్నాడు.


 అయితే మొన్నటి వరకు కెప్టెన్ గా కొనసాగినప్పటికీ ఇక వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అతను చివరికి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అని చెప్పాలి. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు బాబర్ అజాం.  అయితే అతను మూడు ఫార్మాట్లలో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన అతను.. ఇటీవల మరో అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. ఇటీవల ఐసీసీ మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే.


 ర్యాంకింగ్స్ ప్రకటన తర్వాత చరిత్ర సృష్టించాడు బాబర్ అజం. ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో అన్ని ఫార్మాట్లలోను టాప్ ఫైవ్ లో నిలిచిన తొలి ఆటగాడిగా బాబా ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో ఏ ఆటగాడు కూడా ఈ రికార్డును సాధించలేదు. ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టెస్ట్ ఫార్మాట్లో ఐదవ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బాబర్ అజాం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రంగాపూర్ రైడర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: