రెండు అగ్రశ్రేణి టీమ్స్ మధ్య ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ జరిగింది అంటే చాలు నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఇలాంటి పోరు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా భారత జట్టును సొంత గడ్డం ఇదే ఓడించింది ఇంగ్లాండు జట్టు. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఒకసారిగా షాక్ లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల టీమిండియా రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లను కూడా ముగించుకుంది. అయితే ఇక రెండో ఇన్నింగ్స్ ముగిసే సరికి 399 పరుగుల టార్గెట్ ను అటు ఇంగ్లాండ్ జట్టు ముందు ఉంచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో ఇంగ్లాండు బరిలోకి దిగింది. అయితే ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో దూకుడుగా ఆడితే ఎంతో సులభంగా టార్గెట్ ను చేదించవచ్చు అని ఇంగ్లాండు భావిస్తుంది. కానీ అది జరగాలంటే చరిత్ర తిరగరాయాల్సిందే. భారత్లో అత్యధిక చేజింగ్ రికార్డు 387 పరుగులు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ లో 250 ప్లస్ పరుగులు చేదన కేవలం ఐదు సార్లు మాత్రమే జరిగింది. వీటిలో నాలుగు సార్లు భారత్ చేదించగా ఒకసారి వెస్టిండీస్ జట్టు 250 ప్లస్ పరుగులు చేసింది. మరి ఇప్పుడు జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 399 పరుగుల లక్ష్యాన్ని చేదించి చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: