ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. కాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్.. తన ఆటతీరుతో ఎంతలా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు సైతం ఇంగ్లాండు బౌలర్ల దాటికి నిలబడలేక వికెట్ సమర్పించుకుంటూ ఉంటే మొన్నే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ మాత్రం బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు.


 ఎంతో అనుభవం ఉన్న సీనియర్ బౌలర్ల బంతులను సైతం బౌండరీలుగా మారుస్తూ.. ఇక తన సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏకంగా వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇక రెండు మ్యాచ్లలో కూడా తన ఆట తీరుతో జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ కు అతనే భవిష్యత్తు అని మరోసారి నిరూపించాడు ఈ ఆటగాడు. అయితే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఇతను రానున్న రోజుల్లో ఇండియన్ క్రికెట్ ని ఏలడం ఖాయమని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే యశస్వి జైష్వాల్ ఇంతలా కష్టపడిన అతనికి అవార్డు మాత్రం దక్కలేదు. వరుసగా రెండు మ్యాచ్ లలో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు యశస్వి జైస్వాల్.


 దీంతో ఈ యువ ఆటగాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ చివరికి అతనికి ఈ అవార్డు వరించలేదు. వైజాగ్ టెస్టులో వికెట్లతో చెలరేగిపోయిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందగా.. ఇక రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్లో బౌలింగ్ లో కూడా ఆకట్టుకున్న జడేజాకి ఈ అవార్డు దక్కింది. దీంతో చిన్నచూపు చూస్తున్నారు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. సిరీస్ ముగిసేసరికి అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడం ఖాయమని ఎంతోమంది అభిమానులకు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: