గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న ఎంతోమంది కీలక ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతూ చివరికి జట్టుకు అందుబాటులో ఉండని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు ప్రస్తుతం వరుసగా మ్యాచ్లు ఆడుతుంది. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇలా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగిన కేఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఇక అతను వరుసగా టెస్ట్ మ్యాచ్లకి దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే   అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ లాంటి మరో కీలక ప్లేయర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇక ఇద్దరు కీలక ప్లేయర్లు లేకుండానే టీమిండియా వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతూ అదరగొడుతుంది. ఇకపోతే ఇక ఇటీవలే రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో అటు భారత జట్టు ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో టీమిండియాకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఏకంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ సమయానికి కేఎల్ రాహుల్ జట్టుకు అందుబాటులోకి రాబోతున్నాడట. క్వాడ్రిసెప్ట్స్ గాయంతో రెండో మూడు టెస్టులకు దూరమై.. అతను ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. కాగా కేఎల్ రాహుల్ గాయపడి జట్టుకు దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో పడిక్కల్ ను అటు బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. కాగా ఈనెల 23 నుంచి 27 తేదీల మధ్య ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: